డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్‌తో భేటీలో క్యూబా అధ్యక్షులు కానెల్
హవానా : క్యూబాపై అమెరికా అమలు చేస్తున్న ఆంక్షల కారణంగా క్యూబా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పడుతున్న తీవ్ర ప్రభావాన్ని క్యూబా అధ్యక్షులు మిగ్వెల్ డియాజ్ కానెల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయెసెస్కు వివరించారు. ఈ నెల 24న టెడ్రోస్ నేతృత్వంలో ప్రతినిధి బృందం హవానాలో పర్యటించింది. ఈ సందర్భంగా జరిగిన భేటీలో అమెరికా ఆంక్షల వల్ల తలెత్తిన విపత్కర పర్యవసానాలను తెలియచేశారు. లక్ష మందికి పైగా ప్రజలు ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తు న్నారని, 34 వేల మందికి పైగా మహిళలకు తగిన వైద్య సంరక్షణ అందడం లేదని అన్రాను. పైగా మందుల కొరతలతో 67 శాతం మందికి పైగా అత్యంత అవసరమైన ఔషధాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 10 వేల మందికి పైగా రోగులకు రేడియాలజీ చికిత్స విషయంలో అనేక ఆటంకాలు ఎదురువుతున్నా యన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు శిశు మరణాల రేటు 4 నుండి 9.9 శాతానికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కొరత, వైద్య సరఫఱాల కొరత ఆరోగ్య సంరక్షణా రంగానికి ప్రధాని అవరోధాలుగా మారాయన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం అనుసరిస్తున్న ఈ విధానాల తో క్యూబాలో ఆర్థిక, సామాజిక జీవనం అతలాకుతలమవుతోందన్నారు. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా సేవలందిస్తున్న క్యూబన్ డాక్టర్లను, నర్సులను ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. అమెరికా ఆంక్షలతో క్యూబా ఎదుర్కొంటున్న మానవతా విపత్తుపై టెడ్రోస్ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. క్యూబా సంక్షోభంపై ఈ ఏడాది మార్చిలో డబ్ల్యుహెచ్ఓ జారీ చేసిన డిక్లరేషన్‌ను గుర్తుచేసుకున్నారు. క్యూబాకు డబ్ల్యుహెచ్ఓ అదనపు సాయాన్ని, ఆర్థిక తోడ్పాటును అందచేసిందని తెలిపారు. ఇంతటి విపత్కర పరిస్థితులున్నా ఆరోగ్య రంగంలో క్యూబా సాధించిన విజయాలను ప్రశంసించారు. డబ్ల్యుహెచ్ఓ పట్ల క్యూబా నిబద్ధతతో వ్యవహరిస్తుందని, పరిశోధనా,అంతర్జాతీయ వైద్య చొరవలపై సహకారాన్ని పటిష్టపరిచేందుకు క్యూబా సంసిద్ధంగా వుంటుందన్నారు.







కామెంట్లు (0)