వందలాది మంది విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, రచయితలు, హక్కుల కార్యకర్తల సంతకాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : డిసెంబర్ 1న సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్మికుల పార్లమెంట్ మార్చ్‌కు దేశం నలుమూల నుంచి వందలాది మంది మేధావులు సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనపై పలువురు ప్రముఖ విద్యావేత్తలు, మాజీ ఉపకులపతులు, శాస్త్రవేత్తలు, సినీ దర్శకులు, రచయితలు, హక్కుల కార్యకర్తలు సంతకాలు చేశారు. ప్రముఖ ఆర్థికవేత్తలు ప్రభాత్ పట్నాయక్, జయతి ఘోష్, ఉత్సా పట్నాయక్, సి.పి చంద్రశేఖర్, అమర్త్య ముఖర్జీ, ప్రభు మహాపాత్ర, అరుణా రాయ్, పబిత్ర సర్కార్, హర్బన్స్ ముఖియా, మనోరంజన్ మొహంతి, రూప్ రేఖా వర్మ, మాలిని భట్టాచార్య, తనికా సర్కార్, నివేదితా మీనన్, పార్తా సేన్, వికె రామచంద్రన్, అచిన్ వనాయక్, బద్రీ రైనా, పమేలా ఫిలిపోస్, రవింద్ అబ్రహమ్, అబ్రనాథ్, అమ్ము అబ్రహమ్. ఫరూఖీ, అరుణ్ కుమార్, ఎన్ వి వర్గీస్, త్రిషిత్ రాయ్, అభిజిత్ చౌదరి, కమలేశ్వర్ ముఖర్జీ, అశోకన్ చారువిల్, నేమోమ్ పుష్పరాజ్, ఆర్. రామ్‌కుమార్, అడ్వకేట్ గాయత్రి సింగ్, డాక్టర్ అనికేత్ ఆలం, డాక్టర్ స్వపన్ చక్రవర్తి, ప్రొఫెసర్ శ్యామల్ చక్రవర్తి, మందక్రాంత సేన్, డాక్టర్ అరుణ్ సింగ్, అనిందిత సర్బాధికారి, బాద్షా మోయిత్రా, బికాష్ భట్టాచార్య తదతరులు మద్దతు తెలిపారు. దేశంలో అసంఘటిత కార్మికుల నిరసనలు, విద్య, ఉపాధి అవకాశాల కోసం యువత ఉద్యమాలు, ఎస్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రజా ఆందోళనలు దేశంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్మిక హక్కులను నిరాకరించడం కేవలం వారి ఉపాధి, జీవన భద్రతపై దాడి మాత్రమే కాదని, పౌరులుగా వారికి ఉన్న హక్కులు, ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులపైనా దాడి చేయడమేనని స్పష్టం చేసింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా మేధావులంతా సంఘటితమై నిలవాలని పిలుపు ఇచ్చారు.







కామెంట్‌లు (0)