ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిక్టర్‌ స్కేలుపై 5.7 తీవ్రత..

10 గంటల క్రితం

earth.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో: జపాన్‌లో ఆదివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దేశంలోని మధ్య ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భూకంప ధాటికి పలు దుకాణాల అద్దాలు పగిలిపోయాయి. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజల్లో పలువురు కిందపడటంతో కనీసం 22 మంది గాయపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

జపాన్‌ వాతావరణ సంస్థ (జేఎంఏ) భూకంప తీవ్రతను 5.7గా నమోదు చేయగా, అమెరికా భూగర్భ సర్వే (యూఎస్‌జీఎస్‌) 5.5గా అంచనా వేసింది. ఆదివారం స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.04 గంటలకు భూకంపం సంభవించింది. షిజుఒకా ప్రిఫెక్చర్‌లో భూమికి సుమారు 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఐచి ప్రాంతంలో ప్రకంపనల తీవ్రత ఎక్కువగా నమోదైంది. షిజుఒకాతో పాటు గిఫు, యమనాషి ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. హమామత్సు, క్యోటో, నారా నగరాల్లోనూ ప్రకంపనలు సంభవించాయి. అయితే టోక్యోలో ఈ భూకంప ప్రభావం కనిపించలేదని సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్