ఫ్లోరెస్: ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలతో తీర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.భూకంపం సముద్ర తీరానికి సమీపంలో తక్కువ లోతులో సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.దీంతో పలువురు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. అమెరికా జియోలాజికల్ సర్వే(USGS)ప్రకారం..భూకంప కేంద్రం ఫ్లోరెస్‌లోని ఎండే నగరానికి సుమారు 68కిలోమీటర్ల వాయువ్య దిశలో,దాదాపు10కిలోమీటర్ల లోతులో నమోదైంది.ఇండోనేషియా భూకంప,వాతావరణ సంస్థBMKGకూడా ఈ భూకంపం సునామీకి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రధాన ప్రకంపనల అనంతరం 6.1, 5.9. 5.6 తీవ్రతతో పలు ప్రకంపనలు నమోదయ్యాయి. సునామీ ముప్పు నేపథ్యంలో ఈస్ట్ నుసా టెంగారా,వెస్ట్ నుసా టెంగారా,దక్షిణ సులవేసి తదితర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు.తీర ప్రాంతాలు,నదీ తీరాలకు దూరంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు.
ఇండోనేషియాను వణికించిన 7.7తీవ్రత భూకంపం..
59 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 15, 2026, 06:59 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)