చైనా : చైనాను శక్తివంతమైన 'బావి' టైఫూన్ అతలాకుతలం చేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా లియావోనింగ్ ప్రావిన్స్ తీవ్రంగా ప్రభావితమవడంతో అక్కడి నుంచి సుమారు 2.6 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతికి రహదారులపై పార్క్ చేసిన కార్లు బొమ్మల్లా నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉండటంతో మంగళవారం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చైనా జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. సుమారు 13 రోజుల క్రితం పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ టైఫూన్ విస్తీర్ణం ఫ్రాన్స్ దేశ పరిమాణానికి సమానంగా ఉందని అధికారులు తెలిపారు. చైనాతో పాటు జపాన్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఉత్తర కొరియా దేశాలపై కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. దీంతో తూర్పు ఆసియా దేశాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖలు సూచిస్తున్నాయి.
టైఫూన్ 'బావి' బీభత్సం .. చైనాలో భారీ వర్షాలు, వరదల్లో కొట్టుకుపోయిన వాహనాలు
14 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 11:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)