గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిలిప్పీన్స్‌లో పడవలో ఘోర అగ్నిప్రమాదం..

1 గంట క్రితం

fire.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 07:22 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఐదుగురు మృతి.. 187 మంది గల్లంతు

ఫిలిప్పీన్స్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పలవాన్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుల పడవలో బుధవారం రాత్రి సముద్రం మధ్యలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోరాన్‌ సమీప జలాల్లో ‘MV జూన్ ఆస్టర్’ అనే పడవలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 137 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో 117 మంది ప్రయాణికులు కాగా, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇప్పటివరకు ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం. మరో 87 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. 42 మందిని రక్షించినట్లు ఫిలిప్పీన్స్‌ కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. బుధవారం రాత్రి 11.02 గంటల సమయానికి 42 మందిని సురక్షితంగా కాపాడినట్లు కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను కోరాన్‌కు తరలించినట్లు చెప్పారు. సముద్ర తీరానికి సుమారు 1.2 నాటికల్‌ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్