బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రికార్డు సృష్టించిన జపాన్: 1.07 లక్షలు దాటిన వందేళ్ల వృద్ధులు!

1 గంట క్రితం

జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య లక్ష దాటి కొత్త రికార్డును సృష్టించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టోక్యో: జపాన్‌లో 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య లక్ష దాటి కొత్త రికార్డును సృష్టించిందని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రపంచంలోనే అత్యధికంగా శతాధిక వృద్ధులు ఉన్న దేశంగా జపాన్ అగ్రస్థానంలో నిలిచింది.


ప్రస్తుతం జపాన్‌లో 100 ఏళ్లు పూర్తయిన వారి సంఖ్య 1,07,677కు చేరింది. విశేషమేమిటంటే.. ఈ శతాధిక వృద్ధులలో 88 శాతం మంది మహిళలే కావడం గమనార్హం. క్యోటో నగరానికి చెందిన 114 ఏళ్ల కిషిమోటో ఫుయో దేశంలోనే అత్యంత వయోధిక మహిళగా నిలవగా, కుమామోటోకు చెందిన 112 ఏళ్ల కాటో హికారు అత్యంత వయోధిక పురుషుడిగా ఉన్నారు.


వైద్య, ఆరోగ్య రంగాలలో సాధించిన సమగ్ర పురోగతే ప్రజలు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహదపడుతోందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు ఆరోగ్యంగా జీవించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో ఉవేనో, అదే సమయంలో పెరుగుతున్న వయోధికుల జనాభా దేశ సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థలకు పెద్ద సవాలుగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.


దీర్ఘాయువుకు రహస్యం ఇదే..

జపాన్ ప్రజల సుదీర్ఘ ఆయుష్షు వెనుక వారి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిలకడైన జీవనశైలే ప్రధాన కారణాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. పాశ్చాత్య ఆహార విధానాలతో పోలిస్తే జపనీయుల ఆహారంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. వారు చేపలు, కూరగాయలు, బియ్యంతో కూడిన సమతుల ఆహారానికి ప్రాధాన్యత ఇస్తారు. దీనికి తోడు ప్రతిరోజూ నడక, సైక్లింగ్, ప్రజా రవాణా వ్యవస్థపైనే ఆధారపడటం, క్రమం తప్పకుండా చేసే వ్యాయామాలు జపనీయులను నూరు వసంతాల పాటు ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్