బ్రసీలియా : నాలుగవ సారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికై లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా (80 ఏళ్లు) చరిత్ర సృష్టించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ఏ అభ్యర్థీ సాధించని రీతిలో లూలా రాజకీయంగా అద్భుతమైన పునరాగమనం సాధించారు.” ట్రంప్ మద్దతున్న మాజీ అధ్యక్షుడు బొల్సెనారో కుమారుడు, సెనేటర్ ఫ్లావియో ఓడిపోయారు. 2003 నుంచి 2011 వరకు అధ్యక్షుడిగా సేవలందించిన లూలా 2022లో మూడోసారి బాధ్యతలు చేపట్టారు. మితవాద పార్టీ దూకుడు, పెరిగిన ధరలు, అవినీతి సవాళ్లను ఎదుర్కొని తాజాగా మరోసారి అధికారం చేపట్టారు. ఫస్ట్ రౌండ్‌లో వెనకబడినా నాలుగో రౌండ్‌లో విజయం సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. లూలా 51శాతానికి పైగా ఓట్లు సాధించగా, బొల్సెనారో 48శాతం ఓట్లు పొందారు.








కామెంట్‌లు (0)