ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు

54 నిమిషాల క్రితం

air port.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 09:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

రియాద్ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు సంబంవించింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో వైమానిక దాడి హెచ్చరికల తర్వాత కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇంధన డిపో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పివేశారు. యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతు గల హౌతీ రెబల్స్ ఈ దాడులకు పాల్పడినట్టు ప్రకటించారు. అయితే, సౌదీ అధికారులు మిస్సైళ్లను కూల్చివేసినట్లు తెలిపారు. ఇక ఎయిర్ పోర్ట్ సమీపంలో పేలుడులో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల కొద్ది ఆలస్యం అవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే హెచ్చరికల నేపథ్యంలో ముందుగానే పేలుడు సంభవించకముందే ఎయిర్ పోర్టులో ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, మక్కా ఒప్పందంలో భాగంగా సౌదీకి సైనిక మద్దతు ఇచ్చేందుకు తుర్కియే సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అక్కడి పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్