శుక్రవారం, 23 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గగనతలంలో ఎమర్జెన్సీ.. లండన్‌కు మళ్లిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం

05 అక్టోబర్, 2026

flight.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 08:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లండన్‌ నుంచి అమెరికాలోని షికాగోకు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గగనతలంలో ఉండగానే విమానం అత్యవసర సంకేతాన్ని పంపడంతో కలకలం రేగింది. అనంతరం విమానం తన గమ్యస్థానానికి వెళ్లకుండా తిరిగి లండన్‌ వైపు మళ్లినట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా వెల్లడించింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన HA285 విమానం బర్లాండ్ గగనతలంపై ప్రయాణిస్తుండగా అంతర్జాతీయ అత్యవసర కోడ్ ‘7700’ (Squawk 7700)ను పంపినట్లు సమాచారం. ఈ కోడ్‌ను విమానంలో అత్యవసర పరిస్థితి నెలకొన్నప్పుడు పైలట్లు ఉపయోగిస్తారు. ఎమర్జెన్సీ కోడ్ పంపిన కొద్దిసేపటికే విమానం దిశను మార్చుకుని లండన్‌ వైపు తిరిగినట్లు ఫ్లైట్‌రాడార్24 ట్రాకింగ్‌లో కనిపించింది. అంతేకాకుండా విమానం కొద్దిసేపటి వ్యవధిలోనే సుమారు 37 వేల అడుగుల ఎత్తు నుంచి 9 వేల అడుగులకు దిగినట్లు సమాచారం.

అయితే విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తింది? అత్యవసర పరిస్థితికి కారణమేంటి? విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడితేనే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్