- కీలకపాత్ర పోషించనున్న చిన్న పార్టీలు
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశాలు కన్పించడం లేదు. అధికార నేషనల్ పార్టీ, ప్రతిపక్ష లేబర్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఇప్పటి వరకూ 97 శాతం ఓట్లను లెక్కించారు. నేషనల్ పార్టీకి 42 స్థానాలు, లేబర్ పార్టీ(లెఫ్ట్) కి 36 స్థానాలు వచ్చాయి. గ్రీన్ పార్టీ(లెఫ్ట్) 16, యాక్ట్ న్యూజిలాండ్ 13, న్యూజిలాండ్ ఫస్ట్ 12, ఆపర్ట్యునిటీ పార్టీ 7, మావోరీ (లెఫ్ట్) 5 స్థానాలు సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించబోతున్నాయి. ఓవర్ హాంగ్ (రాజకీయ పార్టీకి వచ్చిన మొత్తం ఓట్ల నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో స్థానాలను గెలుచుకోవడం) కారణంగా ఈసారి పార్లమెంటులో మొత్తం స్థానాల సంఖ్య 131కి చేరింది. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు 66 సీట్లు అవసరమవుతాయి. నేషనల్ పార్టీ, యాక్ట్, న్యూజిలాండ్ ఫస్ట్ కలిసి కూటమిగా ఏర్పడితే 67 సీట్లతో మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉంది. లేబర్ పార్టీ, గ్రీన్స్, మావోరీ కూటమికి ఇప్పటి వరకూ 57 సీట్లు వచ్చాయి. సుమారు మూడు లక్షలకు పైగా ఉన్న స్పెషల్ ఓట్లను ఇంకా లెక్కించాల్సి ఉంది. వీటి లెక్కింపు జరిగి పూర్తి స్థాయిలో అధికారిక ఫలితాలు వెలువడడానికి 27వ తేదీ వరకూ సమయం ఉంది. ఆ తర్వాతే న్యూజిలాండ్‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది తెలుస్తుంది








కామెంట్‌లు (0)