ఆసన్సియన్ : కొలరాడో పార్టీ మాజీ అధ్యక్షుడు, వ్యాపార వేత్త హోరాసియో కార్టెస్‌కు సన్నిహిత మిత్రుడైన పెడ్రో అలియానా శుక్రవారం పరాగ్వే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆన్‌లైన్‌లో రుణాలు ఇచ్చే ఉయ్‌నో బ్యాంక్ కుప్పకూలిన నేపథ్యంలో పరాగ్వే అధ్యక్షులు శాంటియాగో పెనాని పార్లమెంట్ దిగువ సభ 78-0 ఓట్ల తేడాతో అభిశంసించిన సంగతి తెలిసిందే. పెడ్రో అలియానా 2023 ఆగస్టు నుండి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ విచారణలో సెనేట్ శాంటియాగో పెనాని దోషిగా నిర్ధారించిన కొన్ని గంటల తర్వాత, శుక్రవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పెడ్రో అలియానా కాంగ్రెస్ ఎదుట ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం అలియానా 2028న ఆగస్టు వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.
పరాగ్వేలో అత్యవసర పరిస్థితులు నెలకొన్నాయని, ఈ ఆర్థిక పతనం ఫలితంగా కష్టకాలం ఎదుర్కొంటున్న ప్రజలకు పూర్తి నష్టపరిహారం చెల్లిస్తామని పెడ్రో అలియానా అన్నారు. డిపాజిటర్లకు తిరిగి చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, నష్టాన్ని భరించలేని వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అలియానా ఆదేశించారు. బాధ్యత వహించిన వ్యక్తి ఉదాసీనంగా వ్యవహరిస్తే సహించేది లేదని, పారదర్శకతలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు.








కామెంట్‌లు (0)