సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉమర్‌ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌ల బెయిల్‌ పిటిషన్‌లపై విచారణ వాయిదా

56 నిమిషాల క్రితం

Umar Khalid, Sharjeel Imam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 21, 2026, 03:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : మాజీ జెఎన్‌యు నేత ఉమర్‌ఖలీద్‌, సామాజిక కార్యకర్త షార్జిల్‌ ఇమామ్‌ ల బెయిల్‌ పిటిషన్‌లపై విచారణను ఢిల్లీహైకోర్టు సోమవారం వాయిదా వేసింది. అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు అనారోగ్యం కారణంగా హాజరుకాకపోవడంతో, ప్రాసిక్యూషన్‌ వాయిదా వేయాల్సిందిగా అభ్యర్థించింది. దీంతో ఈ పిటిషన్‌లపై విచారణను సెప్టెంబర్‌ 30కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ప్రతిభా ఎం.సింగ్‌, జస్టిస్‌ దినేష్‌ భట్‌ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. తమకు బెయిల్‌ నిరాకరిస్తూ ఈ ఏడాది జుల్‌లో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఉమర్‌ ఖలీద్‌, షార్జిల్‌ ఇమామ్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అల్లర్ల కేసులో 2020 సెప్టెంబర్‌లో ఖలీద్‌ను, 2020 ఆగస్టులో ఇమామ్‌లను యుఎపిఎ చట్టం కింద అరెస్ట్‌ చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్