బుధవారం, 19 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

పాక్‌ బలగాల అణచివేత : 20 మంది మృతి

29 జులై, 2026

pak
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 06:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌‌ (‌పిఓకె)లో ఎన్నికలను బహిష్కరించాలని పిలుపిచ్చిన స్థానికులపై పాకిస్తాన్‌ అణచివేత చర్యలకు దిగడంతో గత 24గంటల్లో 20మంది కాశ్మీరీలు మరణించగా, 50మందికి పైగా గాయపడ్డారు. ఆందోళనకారులను లక్ష్యంగా చేసుకుని పాకిస్తానీ బలగాలు దాడులకు దిగడంతో రావల్‌‌కోట్‌‌లోని డెరిక్‌ ‌యైత్‌ ఏరియాలో హింస రేగినట్లు వార్తలు వచ్చాయి. జూన్‌ 5‌న పిఓకెలో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు పాక్‌‌ బలగాలు 80మందిని హత్య చేశాయి. భద్రతా బలగాలు జనాలపైకి కాల్పులు జరపడంతో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలు చెల్లాచెదురుగా పడి వున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. రావల్‌కోట్ ఏరియా శవాలతో, క్షతగాత్రులతో నిండిపోయిందని పిఓకెకు చెందిన సోషల్‌ ‌మీడియా ఇన్‌‌ప్లూయన్సర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికలను బహిష్కరించాలని పిలుపిచ్చిన అసమ్మతివాదుల నోరు నొక్కేందుకు పాక్‌ ‌బలగాలు కాల్పులు జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాయి. ఆ ప్రాంతంలో ఇంటర్‌‌నెట్‌, మొబైల్‌ సేవలు స్తంభించాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌‌, నీటి సరఫరా నిలిపివేశారు. పిఓకెలోని లెజిస్లేటివ్‌ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగుతాయి. సోమవారం నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడంతో పిఓకెవ్యాప్తంగా పెద్ద ఎత్తున భద్రత కోసమంటూ 14వేలమందికి పైగా భద్రతా సిబ్బందిని పాక్‌ ‌పంపింది. 27వ తేదీన 13సీట్లకు పోలింగ్‌ ‌జరగ్గా, ఆగస్టు 2న 12 శరణార్ధ నియోజకవర్గాలతో పాటూ మరో 9 నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆగస్టు 10న మరో 11సీట్లకు పోలింగ్‌ ‌జరగాల్సి వుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్