రియాద్ : ఇటీవల మూసివేసిన రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమాన రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయని అధికారులు తెలిపారు. అయితే, హౌతీలు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఆదివారం తెల్లవారుజామున రియాద్ విమానాశ్రయం నుండి సౌదీ నగరమైన జెడ్డాకు ఒక విమానం బయలుదేరినట్లు పేర్కొన్నారు. విమానాశ్రయంలో ఆదివారం నుండి టెర్మినల్ (1) దేశీయ విమానాలకు, టెర్మినల్ (2) జాతీయ విమానయాన సంస్థల అంతర్జాతీయ విమానాలకు కేటాయించబడుతుందని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఎక్స్‌లోపేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే, రియాద్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు సౌదీ నేతృత్వంలోని సైన్యం తెలిపింది. సౌదీ అరేబియా, యెమెన్‌పై ఇటీవలి కాలంలో దాడులు పెరిగిన సంగతి తెలిసిందే. రియాద్ విమానాశ్రయంపై ఈ నెలలో జరిగిన దాడిలో 13 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత ఘోరమైన దాడిగా అధికారులు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)