గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

PAKISTAN - కూలిన స్కూల్ పైకప్పు - 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి

2 గంటల క్రితం

School roof collapses – 28 students and a teacher killed
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 01:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పాకిస్థాన్ : పాకిస్థాన్‌లోని పెషావ‌ర్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్‌ లో పైక‌ప్పు కూలి 29 మంది మృతి చెందారు. వీరిలో 28 మంది విద్యార్థులు, ఓ మ‌హిళా టీచ‌ర్ ఉన్నారు. మరణించిన విద్యార్థుల్లో అబ్బాయిలు, అమ్మాయిలు ఉన్నారు. బాధితుల్లో ఏడు నుంచి 12 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న విద్యార్థులున్నారు. పెషావ‌ర్ ఆస్ప‌త్రిలో ప్ర‌స్తుతం ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. అల్ ఖైర్ స్కూల్ రూఫ్ కూలిన‌ట్లు పెషావ‌ర్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అఫ‌క్ వాజిర్ తెలిపారు. శిథిలాల కింద విద్యార్థులు చిక్కుకున్నారు. రూఫ్ కూలిన స‌మ‌యంలో విద్యార్థులు క్లాస్‌రూము‌ల్లో ఉన్న‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది. శిథిలాల‌ను తొల‌గిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం నేపథ్యంలో పాఠశాల యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల పాకిస్థాన్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. త‌క్ష‌ణ చ‌ర్య‌ల‌కు ఆదేశించారు. విద్యార్థులే మ‌న పెట్టుబ‌డి అని, వాళ్ల‌ను కోల్పోవ‌డం తీవ్ర విషాద‌మేనని ఆయ‌న పేర్కొన్నారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్