ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పోలాండ్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి

10 గంటల క్రితం

i76enaks_poalnd_625x300_08_November_26.webp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 08, 2026, 11:33 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 15 మందికి గాయాలు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

క్రాకో: పోలాండ్‌లోని చారిత్రక నగరం క్రాకోలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. నగరంలోని రద్దీగా ఉండే మెయిన్‌ మార్కెట్‌ స్క్వేర్‌ వద్ద ఓ వ్యక్తి కారులో వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డారు.

శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో మార్కెట్‌ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో గాయపడిన నిందితుడిని అదుపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసు అధికారులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు ఒక్కడే ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అతడి నేపథ్యం, దాడికి గల కారణాలపై పోలాండ్‌ భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్