- ఢిల్లీలో లాఠీచార్జిపై ఆగ్రహం
మాంచెస్టర్ : విద్యార్థులపై ఇండియన్ పోలీసుల లాఠీచార్జీని భారత విద్యార్ధి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ-యుకె) కమిటీ ఖండించింది. మంగళవారం యునైటెడ్ కింగ్డమ్(యుకె)లోని మాంచెస్టర్‌లో విద్యార్ధులు నిరసన తెలిపారు. భారత విద్యార్థి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ-యుకె కమిటీ నాయకులు మనోజ్, గాయత్రి మాట్లాడుతూ ఒక తరం యువత మనసులో నెలకొన్న ఆగ్రహం, అసంతృప్తిని ప్రతిబింబిస్తూ విద్యార్థులు పోరాడుతున్నారని తెలిపారు. నీట్ పరిక్ష పేపర్ లీక్ వ్యవహారంలో జవాబుదారీతనం ఉండాల్సిందే అని, మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. సరిహద్దులు మనల్ని వేరు చేయవచ్చు గానీ, న్యాయం కోసం చేసే గర్జన ఏ సరిహద్దు వద్దా ఆగదని, సంఘీభావం కొనసాగుతుందని పేర్కొన్నారు. అలాగే, ఎడిన్‌బరాలోనూ సోమవారం నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎడిన్‌బరా అధ్యక్షురాలు స్వర్ణ ఉద్యయ ఆవశ్యకత గురించి వివరించారు. అనంతరం కార్యదర్శి అభినవ్ మాట్లాడుతూ ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. అలాగే, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకారం అందించాలన్నారు. అనంతరం పలువురు విద్యార్ధులు అమ అభిప్రాయాలను పంచుకున్నారు.








కామెంట్‌లు (0)