శనివారం, 21 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

​ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలి

5 రోజుల క్రితం

​ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలి
- లండన్‌ ‌సదస్సులో వక్తలు
- జాన్ బ్రిట్టాస్, ప్రకాష్ రాజ్ హాజరు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- లండన్‌ ‌సదస్సులో వక్తలు

- జాన్ బ్రిట్టాస్, ప్రకాష్ రాజ్ హాజరు

లండన్: ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత బలోపేతం చేయాలని సిపిఎం ఎంపి జాన్‌‌బ్రిట్టాస్‌ ‌పిలుపునిచ్చారు. ‘‘వాయిసెస్ ఆఫ్ రెసిస్టెన్స్: హౌ జెన్ జెడ్ ఈజ్ రీషేపింగ్ ఇండియన్ డెమోక్రసీ’’ పేరుతో లండన్‌లో సోమవారం జరిగిన చర్చా కార్యక్రమంలో సిపిఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ పాల్గొని ప్రసంగించారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిస్ట్స్ (ఎఐసి) నిర్వహించిన ఈ కార్యక్రమం ఆలోచనలు, సంభాషణలు, భిన్న దృక్కోణాల వేదికగా సాగింది. నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ సహా పలువురు ఈ చర్చలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం, యువత భాగస్వామ్యం, భారతదేశ భవిష్యత్తు అనే అంశాలపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సంభాషణలను కొనసాగిస్తూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు పోరాడాలని సమావేశం తీర్మానించింది. కార్యక్రమానికి సుమారు 450 మంది ఉత్సాహవంతులు హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రకాష్ రాజ్, జాన్ బ్రిట్టాస్‌ల రాక, వారి ప్రసంగాలు కార్యక్రమానికి ప్రత్యేకత తెచ్చాయని పేర్కొన్నారు. వీసా సంబంధిత సమస్యల కారణంగా ఐషీ ఘోష్ హాజరు కాలేకపోయారని నిర్వాహకులు తెలిపారు. ఆమెను త్వరలో మరో కార్యక్రమానికి ఆహ్వానిస్తామని చెప్పారు. వక్తలు, నిర్వాహకులు, వలంటీర్లు, మద్దతుదారులు, ముఖ్యంగా హాజరైన వారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య భవిష్యత్తు చైతన్యవంతమైన, అవగాహన ఉన్న, ధైర్యవంతమైన తరానిదేనన్న సందేశాన్ని ఈ కార్యక్రమం మరోసారి చాటిందని వారు పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్