గురువారం, 22 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యూరప్‌లో నిరసనలు : భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక

4 గంటల క్రితం

యూరప్‌లో ఉద్రిక్తత: భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక

యూరప్‌లో ఉద్రిక్తత: భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 04:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిస్:

యూరప్‌లో విపరీతంగా పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఫ్రాన్స్‌తో పాటు పలు యూరోపియన్ దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అక్కడి భారతీయ పౌరులకు, పర్యాటకులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేసింది.


ఎంబసీ జారీ చేసిన ముఖ్యాంశాలు:

* ఫ్రాన్స్‌లో నివసిస్తున్న భారతీయులు, ఆ దేశాన్ని సందర్శించాలనుకునే పర్యాటకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

* నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు, పెద్ద ఎత్తున గుమిగూడే జనసమూహాలకు పౌరులు వీలైనంత దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.

* ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే కర్ఫ్యూ అమల్లో ఉన్నందున, స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

* రవాణా సేవల్లో తలెత్తుతున్న అంతరాయాలు, తాజా వార్తలను నిరంతరం గమనించాలని విజ్ఞప్తి చేశారు.

* అత్యవసర పరిస్థితులు తలెత్తితే... తక్షణ సహాయం కోసం పారిస్‌లోని ఇండియన్ ఎంబసీ (ఫోన్ నంబర్: +33 6 48 34 00 63, ఇమెయిల్ ఐడీ: cgo.marseille@mea.gov.in)ని సంప్రదించాలని అధికారులు వెల్లడించారు.


ఇతర దేశాలకు పాకుతున్న నిరసనలు:

ఫ్రాన్స్‌లో ప్రారంభమైన ఈ నిరసనల జ్వాల కేవలం అక్కడికే పరిమితం కాకుండా ఇటలీ, బెల్జియం, పోర్చుగల్, అల్బేనియా, గ్రీస్ తదితర దేశాలకు కూడా వేగంగా వ్యాపిస్తున్నాయి. విద్యా రంగంలోని సంక్షోభం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగ సమస్యలపై ప్రజలు రోడ్డెక్కడంతో యూరప్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్