అమెరికా : జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించిన నేపథ్యంలో .... ఆదివారం అమెరికా ఇరాన్‌పై తాజాగా సైనిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ చేసిన దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించడంతో వీటిని చేపట్టినట్లు అమెరికా వెల్లడించింది. ఇది వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య ఉద్రిక్తతలను మరో ప్రధాన స్థాయికి చేర్చింది. యూఎస్ సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకారం .... ఈ దాడులు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జిసి)ను లక్ష్యంగా చేసుకుని జరిగాయి. ఈ దాడికి ఐఆర్‌జిసియే కారణమని అమెరికా ఆరోపించింది. హార్మూజ్ జలసంధి గుండా జరిగే వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని కూడా వాషింగ్టన్ పేర్కొంది.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడుల నుండి రక్షించుకునే క్రమంలో ఇద్దరు అమెరికన్ సైనికులు మరణించారని సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. మరో అమెరికన్ సైనికుడు గల్లంతయ్యాడు, కాగా గాయపడిన నలుగురిని జోర్డాన్‌లోని ఆసుపత్రులకు తరలించగా, తరువాత వారు డిశ్చార్జ్ అయ్యారు. స్వల్ప గాయాలైన పలువురు ఇతర సైనికులు ఇప్పటికే తిరిగి విధుల్లో చేరారు. అమెరికా సైన్యం వివరాల ప్రకారం .... ఫిబ్రవరి 28న సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి 16 మంది అమెరికన్ సైనికులు మరణించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశించిన ఈ దాడులు, "హార్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకాయానానికి ముప్పు కలిగించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింతగా దెబ్బతీయడానికే ఉద్దేశించబడ్డాయి" అని సెంట్రల్ కమాండ్ (CENTCOM) X రేడియోలో తెలిపింది.
అమెరికా దాడులకు ప్రతీకారంగా కువైట్‌లోని రెండు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఆదివారం ప్రకటించింది. కువైట్‌లోని క్యాంప్ ఉదైరిలో ఉన్న మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రంపై, అలీ అల్ సలేం ఎయిర్ బేస్ లోని పేట్రియట్ రాడార్ వ్యవస్థ, వైమానిక నిఘా రాడార్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఇరాన్ సైన్యం వెల్లడించింది.








కామెంట్‌లు (0)