ఆదివారం, 08 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇరాన్‌‌తో యుద్ధం వల్లే ఓడిపోయాం..

2 రోజుల క్రితం

TRUMP
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 12:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వ్యాఖ్యలు

వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు రిపబ్లికన్‌ ‌పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఘోర పరాజయానికి ఇరాన్ యుద్ధమే కారణమని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ వ్యాఖ్యానించారు. ‘‘మేం ఓడిపోవడానికి కారణం యుద్ధమే. నిన్న రాత్రి అధ్యక్షుడే స్వయంగా ఈ మాట అన్నారు.’’ యుద్ధంపై అసంతృప్తితో గత ఎన్నికల్లో ట్రంప్‌నకు ఓటేసిన చాలామంది ఈసారి డెమొక్రట్లకు వేశారని సూచించే డేటా, పోలింగ్ వివరాలను ఆయన ఉటంకించారు. ఈ మేరకు బుధవారం సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఓటింగ్ శాతం అన్ని రాష్ట్రాల్లో సంతృప్తికరంగా లేదని, రిపబ్లికన్ ఓటర్లు పోలింగ్‌కు వచ్చారని, అయితే వారు ప్రతిపక్షానికి ఓటేశారని వాన్స్ అన్నారు. కోల్పోయిన మద్దతు తిరిగి పొందాలంటే తక్షణమే యుద్ధాన్ని ముగించాలని, ద్రవ్యోల్బణంపై దృష్టి పెట్టాలని, అమెరికాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, ఇజ్రాయిల్‌‌తో సంబంధాల్లోనూ మార్పు రావాలంటూ రాసుకొచ్చారు. ఇటీవలి మీడియా సమావేశంలో ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో తనకూ వాన్స్‌కూ విభేదాలున్నాయా అని ట్రంప్‌ను అడగ్గా, అలా ఏమీ లేదని బదులిచ్చారు. ఈ విషయంలో ఇద్దరం ఏకాభిప్రాయంతో ఉన్నామని, ఆయన ఉత్సాహంగానే పని చేస్తున్నారని ట్రంప్‌ ‌తెలిపారు. జెడి వాన్స్ ఇరాన్‌‌తో యుద్ధం సుదీర్ఘకాలం సాగుతుందని కూడా వ్యాఖ్యానించడం గమనార్హం. 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్న తరుణంలో మధ్యంతర ఎన్నికల ప్రభావం వాన్స్ పై పడకుండా రిపబ్లికన్లు వ్యూహాత్మకంగా ఈ వైఫల్యాల నుంచి తప్పుకునే ప్రయత్నమని పలువురు విశ్లేషిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్