వాషింగ్టన్:
ఒప్పందానికి రాకపోతే కొత్త సంవత్సరం తర్వాత ఇరాన్‌పై మరోసారి సైనిక దాడులు చేయడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా విధించిన నౌకాదళ ఆంక్షలను అతిక్రమించడానికి ప్రయత్నించే ఇరాన్ నౌకలను ధ్వంసం చేసి సముద్రంలో ముంచేస్తామని ఆయన తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
ఆదివారం 'ఫాక్స్ న్యూస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. చర్చలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడానికి ఇరాన్ అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ చర్చల్లో గణనీయమైన పురోగతిని తాను ఆశించడం లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఎటువంటి రాజీకి రాకుండా ఇరాన్ చర్చలను కావాలనే సాగదీస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే, నూతన సంవత్సరం తర్వాత ఇరాన్‌పై మళ్లీ సైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని కూడా అమెరికా అధ్యక్షుడు తోసిపుచ్చలేదు.
టెహ్రాన్‌తో పరోక్ష చర్చలు కొనసాగుతున్నప్పటికీ, అమెరికా-ఇరాన్ సైనిక దళాల మధ్య కాల్పులు, ఘర్షణలు కొనసాగే అవకాశమే ఎక్కువగా ఉందని ట్రంప్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.







కామెంట్‌లు (0)