శనివారం, 07 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రపంచంలోనే తొలిసారిగా మనుషుల్లో 'షమొండా వైరస్' గుర్తింపు : ఫ్రాన్స్‌లో ఒకరి మృతి

22 అక్టోబర్, 2026

ప్రపంచంలోనే తొలిసారిగా మనుషుల్లో 'షమొండా వైరస్' గుర్తింపు : ఫ్రాన్స్‌లో ఒకరి మృతి

ప్రపంచంలోనే తొలిసారిగా మనుషుల్లో 'షమొండా వైరస్' గుర్తింపు : ఫ్రాన్స్‌లో ఒకరి మృతి

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026, 04:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

పారిస్: ప్రపంచంలోనే తొలిసారిగా ఒక మనిషిలో 'షమొండా వైరస్' (Shamonda virus) నిర్ధారించబడింది. ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఈ వైరస్ బారినపడి ఒక వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. సాధారణంగా పశువుల్లో మాత్రమే కనిపించే ఈ వైరస్, మనుషుల్లో తీవ్రస్థాయిలో వ్యాధి నిరోధక శక్తిని (Immunity) హరించేలా ఉండటం గమనార్హం.


ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని పశువులలో ఈ వ్యాధి విస్తృతంగా కనిపిస్తున్నప్పటికీ, మనుషుల్లో ఇది వెలుగు చూడటం ఇదే ప్రథమం. ఈ పరిణామంపై 'యూరోపియన్ సెంటర్ ఫ్రూ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్' (ECDC) అత్యంత అప్రమత్తతతో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు ప్రకటించింది.


ప్రస్తుతానికి సామాన్య ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా కల్పించారు. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. కాగా, ఆస్ట్రియా, బెల్జియం, ఐర్లాండ్, ఇటలీ, లీచ్‌టెన్‌స్టైన్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్లోవేనియా, స్పెయిన్, యూకేలోని జెర్సీ తదితర దేశాలలోనూ ఈ వైరస్ ఆనవాళ్లు గుర్తించారు.


అయితే ఆయా దేశాలలో ఇది కేవలం జంతువులలో మాత్రమే సోకినట్లు తేలింది. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్