గురువారం, 19 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'హోర్ముజ్'లో మూడు చమురు ట్యాంకర్లలో మంటలు

2 గంటల క్రితం

hormuz
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 19, 2026, 09:40 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- మందుపాతరలను ఢీకొని మంటలు

టెహ్రాన్: వ్యూహాత్మకమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. జలసంధికి తూర్పు వైపున మందుపాతరలను ఢీకొన్న అనంతరం మూడు చమురు ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసి) వెల్లడించింది. ఇరాన్ నౌకాదళం జారీ చేసిన హెచ్చరికలను పట్టించుకోకుండా, నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించడం వల్లే ఈ ఘటన జరిగినట్లు ఆరోపించింది. నౌకలు తమ నావిగేషన్ వ్యవస్థలను నిలిపివేసి, ఇరాన్ నౌకాదళ హెచ్చరికలను విస్మరించి ప్రమాదకర ప్రాంతం గుండా ప్రయాణించాయని ఐఆర్జీసి పేర్కొంది. ఈ కారణంగానే మందుపాతరలను ఢీకొని ట్యాంకర్లలో మంటలు చెలరేగినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు తప్పనిసరిగా ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఐఆర్బీఐ సూచించింది. ఈ కీలక జలమార్గంలో నౌకల రాకపోకలపై ఆంక్షలు, హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజా ఘటన అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఇదే ప్రాంతంలో కనీసం ఐదు నౌకలపై దాడులు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు, హోర్ముజ్ జలసంధిలో అమెరికా సూచించినట్లు చెబుతున్న 'నకిలీ మార్గాలను' అనుసరించవద్దని ఇరాన్ సైన్యం నౌకలను హెచ్చరించింది. అలాగే జలసంధిపై నిఘా నిర్వహిస్తున్న రెండు అమెరికా డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటించింది.

ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్