గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆర్సెలర్ మిట్టల్‌ ఆస్తులు జాతీయం!

19 జూన్, 2026

rac
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 20, 2026, 01:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- బిల్లు ప్రవేశపెట్టిన వామపక్ష పార్టీ

- ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదం

- సెనెట్‌ ఆమోదిస్తేనే అమలులోకి...

​పారిస్: ప్రపంచ స్థాయి ఉక్కు దిగ్గజం, భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన 'ఆర్సెలర్ మిట్టల్' కు ఫ్రాన్స్‌లో చుక్కెదురైంది. ఆ కంపెనీ ఆస్తులను జాతీయీకరణ చేసే బిల్లుకు ఆ దేశ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలంటే ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సంస్థ నడపాలని ఫ్రాన్స్‌ ‌ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. ఈ విధంగా పార్లమెంట్‌ ‌బిల్లును ఆమోదించడం రెండోసారి కావడం గమనార్హం.


అసలేం జరిగింది?

ఫ్రాన్స్‌లోని ఆర్సెలార్ మిట్టల్ ఉక్కు కార్యకలాపాలను కొనసాగిస్తుంది. తగిన పారిశ్రామిక ఉద్యోగాలు కల్చించలేదు. కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకోకపోగా, హరిత ఇంధన పెట్టుబడులలో తీవ్ర జాప్యం చేసింది. మిట్టల్‌ ‌దేశాన్ని విడిచిపెడతారని, డీకార్బనైజేషన్‌లో పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా లేరని ప్రచారం జరిగింది. దీంతో ఫ్రాన్స్‌ ‌ప్రతిపక్షాలు, చట్టసభ సభ్యులు ఉక్కు పరిశ్రమ ఆస్తులు ప్రజలకు చెందుతాయని, ప్రైవేటు రంగంలో కీలకమైన ఉక్కురంగం ఉండటం సరేనది కాదని, తక్షణమే ఆ సంస్థ ఆస్తులను జాతీయం చేయాలంటూ చర్చను లేవదీశారు. గత వారం వామపక్ష పార్టీ అయిన 'అన్‌బోడ్ ఫ్రాన్స్' (లా ఫ్రాన్స్ ఇన్సౌమిస్) పార్లమెంట్‌‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టింది. దీనికి అనుకూలంగా 106 మంది సభ్యులు ఓటు వేయగా, 49 మంది వ్యతిరేకించారు. గత ఏడాది చివరలో మొదటిసారి ఆమోదం పొందిన ఈ బిల్లును, ఫిబ్రవరి 2026లో సెనేట్ తిరస్కరించింది. రెండోసారి దిగువ సభలో ఈ బిల్లు నెగ్గడంతో ఇప్పుడు తిరిగి సెనేట్ పరిశీలనకు వెళ్లనుంది. ఈ జాతీయీకరణ ప్రక్రియకు దాదాపు 3 బిలియన్ యూరోలు (సుమారు రూ. 27,000 కోట్లు) ఖర్చవుతుందని అంచనా. ఫ్రాన్స్ పారిశ్రామిక సార్వభౌమాధికారాన్ని కాపాడటమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని వారు పేర్కొన్నారు. ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్క్యూర్ దీనిని విమర్శిస్తూ, ఇదొక "నిర్మాణాత్మక సమస్యకు పాపులిస్ట్ స్పందన" అని అభివర్ణించారు. ఆర్సెలార్‌ ‌మిట్టల్‌ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అలైన్ లే గ్రిక్స్ డి లా సాల్లే ఈ పరిణామంపై తీవ్రంగా స్పందించారు. చర్చ అంతా ఏకపక్షంగా సాగిందంటూ ఆర్సెలర్ మిట్టల్‌‌కు మద్దతు తెలిపారు. "ఆర్సెలర్ మిట్టల్ ఫ్రాన్స్‌ను వదిలి వెళ్లడం లేదు. గత ఐదేళ్లలో మేము ఇక్కడ 1.7 బిలియన్ యూరోల పెట్టుబడి పెట్టాము" అని ఆయన స్పష్టం చేశారు. ఫ్రాన్స్‌లో ఆ కంపెనీకి 100కు పైగా కేంద్రాలు, 15 వేల మంది ఉద్యోగులు న్నారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆర్సెలార్ మిట్టల్‌కు అధికార ప్రభుత్వం మద్దతుగా ఉండటంతో సెనెట్‌‌లో ఆమోదం పొందటం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్