శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఖతర్‌, టర్కీల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం..

14 నవంబర్, 2026

ఖతర్‌, టర్కీల మధ్య పరస్పర రక్షణ ఒప్పందం
- ఇస్తాంబుల్ భేటీలో నిర్ణయం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇస్తాంబుల్ భేటీలో నిర్ణయం​

ఇస్తాంబుల్‌ : ఖతర్, టర్కీ దేశాలు పరస్పర రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల్లో ఎవరిపైనైనా బయటి శక్తులు సాయుధ దాడికి పాల్పడితే ఉమ్మడి వైఖరి తీసుకోవాలని ఈ ఒప్పందం పేర్కొంటోంది. ఇస్తాంబుల్‌లో శుక్రవారం జరిగిన టర్కియే ఖతర్ సుప్రీం స్ట్రాటజిక్ కమిటీ 12వ సమావేశంలో ఇది ఖరారైంది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ భేటీలో ఈ ఒప్పందం ఖరారైంది. అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధ ప్రభావాలు, హర్మూజ్‌ జలసంధిలో నౌకా రవాణా అంతరాయాల నేపథ్యంలో ఈ ఒప్పందం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం భద్రతా ముప్పులు, రక్షణ విధానంపై ఇరు దేశాలు పరస్పరం సంప్రదించుకోనున్నాయి. సంయుక్త సైనిక విన్యాసాలు, రక్షణ పరిశ్రమల సహకారం, సిబ్బంది శిక్షణ మార్పిడిని విస్తరిస్తాయి.విద్య, వినియోగదారుల రక్షణ, శాంతి, సయోధ్య రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఒప్పందం ఏ పరిస్థితుల్లో అమల్లోకి వస్తుంది, ఉమ్మడి స్పందన ఎలా ఉంటుందన్న వివరాలను ప్రకటించలేదు. అలాగే, ఇరాన్‌పై యుద్ధాన్ని చర్చలు, దౌత్యం ద్వారా పరిష్కరించాలని ఇరు దేశాలు కోరాయి. హర్మూజ్‌ జలసంధి గుండా సురక్షితమైన, అడ్డంకుల్లేని రవాణా త్వరగా పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి. టర్కియే, ఖతర్, పాకిస్తాన్, ఇండోనేషియా సంతకం చేసిన ‘‘బదర్ మెమోరాండం’’ను కూడా స్వాగతించాయి. ఉమ్మడి ఉత్పత్తి, సాంకేతికత అభివృద్ధి, సమాచార మార్పిడి ద్వారా సామూహిక రక్షణ దిశగా ఇది ముందడుగని పేర్కొన్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్