మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కెనడా ఉత్పత్తులపై 50శాతం సుంకాలు : ట్రంప్‌

6 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 01:40 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : కెనడా ఉత్పత్తులపై 50శాతం సుంకాలు విధించే ఉత్తర్వులపై అమెరికా అధ్యక్ష‍ుడు ట్రంప్‌ సోమవారం సంతకం చేశారు. ఈ సుంకాలు నెలరోజుల్లో అమల్లోకి వస్తాయని, వీటి పరిధిలోకి వైన్‌, హాకీస్టిక్స్‌, సిమెంట్‌ వంటి ఉత్పత్తులు వస్తాయని వైట్‌ హౌస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా మద్యం, వాహనాలు, పాల ఉత్పత్తులపై కెనడా ప్రభుత్వం వివక్ష‍ాపూరిత వైఖరిని అవలంబిస్తోందని మండిపడింది. 2025 నుండి అధ్యక్ష‍ుడు ట్రంప్‌ విధించిన విస్తృతమైన సుంకాలకు ప్రతిచర్యగా చర్యలు చేపట్టిన రెండు దేశాల్లో (చైనా) కెనడా ఒకటని వైట్‌ హౌస్‌ పేర్కొంది. కెనడాను అమెరికా "51వ రాష్ట్రం"గా విలీనం చేయాలన్న ట్రంప్‌ పదేపదే ఇస్తున్న హెచ్చరికలకు నిరసనగా, కెనడియన్ ప్రావిన్సులు అమెరికా మద్యం కొనుగోళ్లను నిలిపివేయడాన్ని కూడా ట్రంప్‌ లక్ష్యంగా చేసుకున్నారు.


కెనడా, అమెరికా మద్యం ఉత్పత్తులను తమ దుకాణాల నుండి తొలగించిందని, యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే పాల ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్‌ను కల్పించిందని అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్ ఆరోపించారు. తమ ఉత్పత్తులను అమెరికాకు తరలిస్తున్న కంపెనీల నుండి కెనడాకు వెళ్లే వాహనాల ఎగుమతులపై పరిమితి విధించిందని అన్నారు. కెనడా ప్రతీకార చర్యలకు, వివక్ష‍కు ఆ దేశాన్ని జవాబుదారీగా ఉంచడమే ఈ సుంకాల లక్ష్యమని ఆయన ప్రకటించారు.


ఈ ఏడాది పలు దేశాలపై ట్రంప్ విధించిన సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ కొత్త సుంకాలను విధించేందుకు ఇప్పటివరకు అమలు చేయని టారిఫ్‌ చట్టం, 1930లోని సెక్ష‍న్‌ 383ను ఎంచుకున్నారు. దీంతో ముఖ్యంగా అమెరికా-మెక్సికో-కెనడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (యుఎస్‌ఎంసిఎ) పరిధిలోకి వచ్చే ఉత్పత్తులపై ప్రభావం చూపుతాయి. గతంలో ట్రంప్ అమెరికా వాణిజ్య భాగస్వామ్యులపై సుంకాలు విధించినప్పటికీ, యుఎస్‌ఎంసిఎ కింద ఆయా దేశాల వస్తువులకు మినహాయింపు ఉండేది. టారిఫ్‌లను విధించడానికి 'సెక్షన్ 338'ను ఉపయోగించడం ఇదే మొదటిసారని లిబర్టేరియన్ సంస్థ 'కాటో ఇన్‌స్టిట్యూట్'కు చెందిన స్కాట్ లిన్సికోమ్ మీడియాకు తెలిపారు. చట్టపరంగా అందుబాటులో ఉన్న ఏ చట్టాన్నైనా సరే, అవసరమైతే దుర్వినియోగం చేయడానికి కూడా వెనుకాడనని ట్రంప్‌ నిరూపించుకున్నారని అన్నారు.


అమెరికాతో చర్చలకు సిద్ధం : కెనడా ప్రధాని

అమెరికాతో చర్చలను వేగవంతం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని కార్నీ తెలిపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి, యుఎస్‌ఎంసిఎని ఆధునీకరించడానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. యుఎన్‌ఎంసిఎ ఒప్పందాన్ని ప్రత్యక్ష‍ంగా ఉల్లంఘిస్తూ అమెరికా చేపడుతున్న ఏకపక్ష‍ వాణిజ్య చర్యల్లో ఇది ఒకటని అన్నారు. కెనడా, తమ హక్కు మేరకు, కేవలం ఆ చర్యలకు ప్రతిస్పందనగానే చర్యలు తీసుకుందని అన్నారు.ఈ ప్రకటనతో కొన్ని వ్యాపార సంస్థల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్