శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్జెంటీనా దౌత్యవేత్తకు బ్రెజిల్‌ సమన్లు

3 గంటల క్రితం

Brazil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 12:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బ్రసీలియా : దేశం నుండి పారిపోయిన మితవాద అభ్యర్థి ప్లావియో బోల్సెనారో గురించి వివరాలు అందించాలని అర్జెంటీనా అగ్ర రాయబారికి బ్రెజిల్‌ సమన్లు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. బ్రెజిల్‌ విదేశాంగ శాఖ గురువారం అర్జెంటీనా ఛార్జ్‌ డి అఫైర్స్‌, ఎమిలియా కోర్టెస్‌ను పిలిపించిందని ఆ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ఆదివారం జరిగిన అధ్యక్ష‍ ఎన్నికల్లో మితవాద అభ్యర్థి ప్లావియో బోల్సెనారో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన అర్జెంటీనాకు అక్కడి నుండి అమెరికాకు పారిపోయినట్లు సమాచారం. బోల్సోనారో దేశం విడిచి వెళ్లిన వ్యవహారం బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డా సిల్వా, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలే మధ్య ఇప్పటికే ఉన్న విభేదాలను మరింత పెరిగే అవకాశముందని ఆ వర్గాలు తెలిపాయి.

ఆదివారం ఎన్నికల అనంతరం పాస్‌పోర్టులు అప్పగించాల్సిందిగా బోల్సోనారోకు గడువు బ్రెజిల్‌ ప్రభుత్వం గడువు విధించింది. బాంకో మాస్టర్‌ స్కామ్‌గా పిలిచే మనీలాండరింగ్‌ కేసులో భాగంగా, ఆయనను దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. మాజీ అధ్యక్షుడు, తన తండ్రి జైర్ బోల్సెనారో సినిమాకు నిధులు సమకూర్చడం కోసం, బాంకో మాస్టర్ మాజీ అధ్యక్ష‍ుడు డేనియల్ వోర్కారో నుండి బోల్సెనారో కోట్ల డాలర్ల చెల్లింపులు తీసుకున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు అధికారులు విచారణ చేపడుతున్నారు.

మరోవైపు, ప్లావియో బోల్సెనారో శుక్రవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. స్వదేశంలో తాను వేధింపులకు గురవుతున్నానని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్‌ డి మోరెస్‌ తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించారు. తాను బ్రెజిల్‌ను విడిచిపెట్టలేదని, బ్రెజిల్‌ కోసమే బయలుదేరాను అని పేర్కొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్