సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రష్యాలో మిస్టరీ న్యూమోనియా - ల్యాబ్ ఉద్యోగి మృతి

1 గంట క్రితం

russia
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 10:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఐసోలేషన్‌లో 197 మంది

మాస్కో: రష్యాలోని సైబీరియా ప్రాంతంలో మిస్టరీ న్యూమోనియా కలకలం రేపుతోంది. ఇర్కుట్స్క్ ప్రాంతంలోని షెలెఖోవ్‌లో ఉన్న యాంటీ-ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేస్తున్న 28 ఏళ్ల మహిళ తీవ్ర న్యూమోనియాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమెకు సోకిన వ్యాధికి కారణం ఏమిటన్నది అధికారికంగా ఇంకా నిర్ధారించలేదు. అయితే ల్యాబ్‌లో పనిచేస్తున్న సమయంలో లైవ్ బయోలాజికల్ మెటీరియల్ ఉన్న టెస్ట్ ట్యూబ్ ప్రమాదవశాత్తూ పగిలినట్లు ఆమె వైద్య సిబ్బందికి చెప్పినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందించినప్పటికీ అక్టోబర్ 1న మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన నేపథ్యంలో ఆమెతో సంబంధం ఉన్న 197 మందిని వైద్య పర్యవేక్షణ, ఐసోలేషన్‌లో ఉంచారు. వారిలో 100 మందికి పైగా ఆసుపత్రుల్లో పర్యవేక్షణలో ఉన్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇప్పటివరకు పర్యవేక్షణలో ఉన్నవారిలో వ్యాధి లక్షణాలు కనిపించలేదని, నిర్వహించిన పరీక్షల్లోనూ నెగెటివ్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై న్యూమోనిక్ ప్లేగ్ అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, రష్యా ఆరోగ్య అధికారులు ప్లేగ్‌నే కారణంగా అధికారికంగా నిర్ధారించలేదు. ప్రస్తుతం వ్యాధికి అసలు కారణాన్ని గుర్తించేందుకు పరీక్షలు, దర్యాప్తు కొనసాగుతున్నాయి. పరిస్థితి స్థిరంగానే ఉందని అధికారులు చెబుతూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్