పారిస్ : వేల సంఖ్యలో భారత నావికులు అంతర్జాతీయ సముద్ర జలాల్లోని వాణిజ్య మార్గాల్లో పనిచేస్తూ వుంటారని, వారి భద్రత తమకు అత్యంత ముఖ్యమని మోడీ స్పష్టం చేశారు. పారిస్‌లో జి-7 దేశాల సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోడీ విడిగా బుధవారం భేటీ అయ్యారు. ఇరాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని అమలు చేసే సమయంలో ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఇటీవల ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో ముగ్గురు భారత నావికులు మరణించిన ఘటనలో భారత ప్రభుత్వ ఆందోళనను ట్రంప్‌కు తెలియచేశారు. తాను కూడా ఆ విషయం విన్నానని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధి తెరిచి వుంచడం కీలకమని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛా వాణిజ్యం జరగాలని భారత్ కూడా ఆకాంక్షిస్తోందన్నారు. ఇదే అంశాన్ని తాము ప్రతీసారీ నొక్కి చెబుతున్నామన్నారు. దీనిపై మనం కలిసి పనిచేయాలని అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి, సుస్థిరతలకు కొత్త ఆశలు చిగురించాయన్నారు. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు ఇప్పుడున్నంతగా సన్నిహితంగా ఎప్పుడూ లేవని ట్రంప్ అన్నారు. వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ప్రపంచ నేతలతో మోడీ చర్చలు
జి7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ బుధవారం ప్రపంచ దేశాల నేతలతో సమావేశమయ్యారు. యూరోపియన్ కౌన్సిల్ చీఫ్ ఆంటోనియో కోస్తా, కెన్యా అధ్యక్షుడు విలియం రుటో, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిలతో మోడీ మాట్లాడారు. జి7 సదస్సులో మోడీ జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడుతున్న దృశ్యాలను అధికారిక జి7 పేజీ పోస్టు చేసింది.









కామెంట్‌లు (0)