గురువారం, 15 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే క్షిపణుల పరీక్ష

1 గంట క్రితం

nk
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 15, 2026, 09:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఉత్తర కొరియా కీలక ప్రకటన!

సియోల్‌ : అమెరికా - ఉత్తర కొరియా లతో దౌత్య సంబంధాలు సుదీర్ఘకాలంగా స్తంభించిపోయిన నేపథ్యంలో ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా మరో కీలక అడుగు వేసింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించేందుకు రూపొందించిన రెండు రకాల క్రూయిజ్ క్షిపణులను పరీక్షించినట్లు ఆ దేశం ప్రకటించింది. బుధవారం తూర్పు తీరానికి సమీపంలోని సముద్ర జలాల్లో ఈ పరీక్షలు నిర్వహించినట్లు గురువారం వెల్లడించింది. దేశ నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం, సముద్రం అడుగున పనిచేసే సైనిక వ్యవస్థల సంసిద్ధతను పరిశీలించడం ఈ పరీక్షల ప్రధాన ఉద్దేశమని ఉత్తర కొరియా అధికారిక మీడియా తెలిపింది.

ఈ ప్రయోగాలు, ఇటీవల కాలంలో కొనసాగుతున్న ఆయుధ ప్రదర్శనల పరంపరను మరింత ముందుకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా సెప్టెంబర్ 20, అక్టోబర్ 3 తేదీలలో వివిధ హైపర్‌సోనిక్ క్షిపణి వ్యవస్థలను పరీక్షించారు. దక్షిణ కొరియా, జపాన్‌లలోని క్షిపణి రక్షణ వ్యవస్థలను అధిగమించేలా రూపొందించిన తమ ఆయుధాగారాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే ఈ పరీక్షల లక్ష్యమని ఉత్తర కొరియా పేర్కొంది.

చాలాకాలంగా నిలిచిపోయిన దౌత్య సంబంధాలను పునఃప్రారంభించాలన్న అమెరికా, దక్షిణ కొరియాల ప్రతిపాదనలను తిరస్కరిస్తూనే, నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలి వారాల్లో ఉత్తర కొరియా ప్రత్యక్ష కాల్పుల విన్యాసాలు నిర్వహించడంతో పాటు ఒక కొత్త యుద్ధనౌకను కూడా ప్రారంభించింది. తాజా పరీక్షలపై దక్షిణ కొరియా సైన్యం వెంటనే అధికారిక స్పందన వెల్లడించలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్