గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనెమ్మదిగా తినండి ఆరోగ్యంగా ఉండండి!

21 గంటల క్రితం

ChatGPT
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 04:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత సమాజంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల ఈ హడావుడి జీవితంలో భోజనం చేయడానికి తగినంత సమయం కేటాయించలేకపోతున్నాం. సరిగ్గా నమలకుండా, తొందర తొందరగా భోజనం చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. భోజనం చేసేటప్పుడు ఈ కింది నియమాలు పాటించాలి.

  • భోజనాన్ని కేవలం 5 నుంచి 10 నిమిషాల్లో ముగించకూడదు. భోజనానికి కనీసం 20 నుంచి 30 నిమిషాలు కేటాయించాలి. నెమ్మదిగా, ప్రశాంతంగా కూర్చుని భోజనం చేయడం వల్ల మనసుకు, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది.

  • ప్రతి ముద్దను 20 నుంచి 30 సార్లు నమలాలి. గట్టిగా ఉండే పదార్థాలను ఇంకా ఎక్కువసార్లు నమలాలి. నోట్లోనే ఆహారం మెత్తని ముద్దలా (పేస్టులా) మారేలా బాగా నమలడం వల్ల జీర్ణవ్యవస్థపై భారం తగ్గి, శరీరానికి పోషకాలు బాగా అందుతాయి.

  • ఆహారం నోటిలోని లాలాజలంతో కలిసి మెత్తగా మారడం వల్ల కడుపులో అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరవు.

  • మనం తింటున్నప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు చేరడానికి కనీసం 20 నిమిషాలు పడుతుంది. త్వరత్వరగా తినడం వల్ల ఆ సంకేతం అందక ఎక్కువగా తినేస్తాం. అదే నెమ్మదిగా తినడం వల్ల అతిగా తినడాన్ని (Overeating) సహజంగానే నివారించవచ్చు.

  • ఎక్కువసార్లు నమలడం వల్ల ఆహారం చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి, శరీరం పోషకాలను సులభంగా, పూర్తిగా గ్రహించే అవకాశం పెరుగుతుంది. భోజనం చేసేటప్పుడు టీవీ, మొబైల్ ఫోన్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ఆహారంపైనే దృష్టి పెట్టి, ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ భోజనం చేయాలి.

- డాక్టర్‌ ఎంవి రమణయ్య,

ప్రజా వైద్యశాల, నెల్లూరు


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్