ఆమె ధైర్యం ఎంతమందిని ఆపిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌పై బైకర్లు తమ బైక్‌లను నడిపిస్తూ ముందుకు వెళ్లడం చాలా సాధారణంగా చూస్తుంటాం. ఈ వీడియోలో కూడా అదే జరుగుతోంది. అయితే ఆ బైకర్లు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లడం లేదు. గట్టిగట్టిగా హారన్లు మోగిస్తున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే వాళ్ల ముందు ఓ ముగ్గురు అమ్మాయిలు నడుస్తున్నారు. బైకర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా వాళ్లు ఫుట్‌పాత్‌పై నడుస్తున్నారు. అమ్మాయిల వెనక హెడ్లైట్లు వేసి ముందుకు వెళ్లలేక హారన్లు మోగిస్తున్న బైకర్లతో ఫుట్‌పాత్ మొత్తం నిండిపోయింది. ఆ సమయంలో ఎవరైనా పాదచారులు రోడ్డు దాటాలన్నా సాధ్యం కాదు. అంత ఇబ్బందిని కలిగిస్తున్నా.. దానికి కారణమైన బైకర్లు మాత్రం సంకోచం లేకుండా అమ్మాయిలదే తప్పన్నట్లు వ్యవహరించారు. వెనక నుండి 'మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? దారి ఇవ్వండి.. అలా అడ్డంగా వెళ్లకపోతే ఒకరి తరువాత ఒకరు వెళ్లొచ్చుగదా' అని అరిచారు. అయినా అమ్మాయిలు పట్టించుకోలేదు. వెనక నుండి ఎవరో ఈ మొత్తం సంఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే 'అమ్మాయిలూ మీరు మంచి పని చేశారు', 'గుడ్ గాళ్స్'.. అంటూ వాళ్ల ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్లు వచ్చిపడ్డాయి. ఈ విషయాన్ని చూస్తుంటే.. 'ఒకరికొకరు అండగా నిలబడుతూ.. ముందడుగు వేస్తుంటే.. ఎంత కష్టమైనా మన దగ్గరకు చేరదు' అన్న విషయం స్పష్టమవుతోంది. ఈ అమ్మాయిలు చూపించింది అదే.. బహుశా వీళ్లు ఒకరికొకరు తెలియొచ్చు.. తెలియకపోవచ్చు.. కానీ.. ఆపదలో వీరంతా ఒక్కటయ్యారు. కనీసం తల తిప్పి వెనక్కి చూడలేదు. అయినా ఒక చిన్న ప్రయత్నంతో పెద్ద ఆలోచనను కలిగించారు. అందుకే 'అమ్మాయిలూ.. మీరు శభాష్' అంటున్నారు వీడియో చూసినవాళ్లంతా..
అమ్మాయిలూ.. మీరు భలే చేశారు!
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 24, 2026, 04:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)