తుపాన్ల పేర్లు వింటేనే
ముందుగా వొణికేది కోస్తాతీరం కాదు
అన్నదాతల వెన్నెముకలు
పెట్టుబడులతో పెరుగుతున్న
పచ్చని పైరులు.
కోతకొచ్చిన పసిడి పంటలు
తాలు గింజలుగా మారి
కన్నీటి మూటలవుతాయని
కర్షకులు కుమిలిపోతుంటారు.
బంగాళాఖాతంలో
అల్పపీడనాలు పడగానే
తీర ప్రాంత రైతుల గుండెల్లోన
వాయుగుండాలు పరుగెడతాయి
తుపాను తీరం దాటే వరకు
కిసానులకు నిద్రాహారాలు కరువు.
తుపానులు బలహీన పడిపోతే
పంటలు పసిడి పంటలై
ఇంటిలోని గాదెలు నిండుతాయి
వాయుగుండం తుపానుగా మారితే
అన్నదాతల బతుకులు యమగండమే.
జడి వానలొచ్చినా వరదొచ్చినా
నిండా మునిగేది రైతు బంధువులే
ప్రకృతి విపత్తుల మధ్యనే
సాగుతున్న రైతన్నల వ్యవసాయం
అప్పులతో నలుగుతున్న వాడి కాయం
ప్రభుత్వాలు అందించాలి ఉదార సాయం.
- జి. సూర్య,
సెల్: 6281725659.







కామెంట్‌లు (0)