వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే కాలంలో పచ్చళ్లు త్వరగా బూజు పట్టే అవకాశం ఉంది. జాడీ మూత తరచూ తెరవడం, తడి స్పూన్లు వాడటం, శుభ్రంగా లేని జాడీల్లో నిల్వ చేయడం, మూత సరిగ్గా బిగించకపోవడం వల్ల ఫంగస్ ఏర్పడుతుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పచ్చళ్లను ఎక్కువకాలం నిల్వ చేసుకోవచ్చు.
పచ్చడి తీసుకునేటప్పుడు ఎప్పుడూ పొడిగా ఉన్న స్పూన్‌నే ఉపయోగించాలి.
పచ్చడిలోని ముక్కలు పూర్తిగా మునిగేలా నూనె ఉండాలి. నూనె తగ్గితే వేడి చేసి చల్లార్చిన నూనెను కలపాలి.
పచ్చళ్లను నిల్వ చేయడానికి శుభ్రమైన సెరామిక్ జాడీలను ఉపయోగించడం మంచిది.
పచ్చడి తీసుకున్న వెంటనే జాడీ మూతను గట్టిగా బిగించాలి.
జాడీలను గ్యాస్ స్టవ్ దగ్గర లేదా వేడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో కాకుండా చల్లని, పొడి ప్రదేశంలో ఉంచాలి.
పచ్చడి పరిమాణం తగ్గినప్పుడు జాడీలో ఖాళీ పెరిగి గాలి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల చిన్న జాడీలోకి మార్చుకోవాలి.
పచ్చడిపై తెలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఫంగస్ కనిపించినా, చెడు వాసన వచ్చినా, నూనె రంగు మారినా దాన్ని ఉపయోగించకపోవడమే మంచిది.








కామెంట్‌లు (0)