- పునర్వినియోగ రోదసీ సాంకేతికతతో ముందడుగు !
బీజింగ్ : లాంగ్ మార్చ్-10బి కేరియర్ రాకెట్‌ను ప్రయోగించిన తర్వాత ఆర్బిటల్ క్లాస్ పునర్వినియోగ రాకెట్ బూస్టర్‌ను చైనా శుక్రవారం రికవరీ చేసుకుంది. రికవరీ అంటే పేలోడ్‌ను డెలివరీ చేసిన తర్వాత రాకెట్ బూస్టర్ తిరిగి భూమికి సురక్షితంగా చేరుకోవడమే. దీంతో పునర్వినియోగ రోదసీ సాంకేతికతో చైనా ప్రధానమైన మైలురాయిని చేరుకున్నట్లైంది. ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ 2015 డిసెంబరులో ఆర్బిటల్ క్లాస్ రాకెట్ బూస్టర్‌ను విజయవంతంగా రికవరీ చేసుకున్న తొలి కంపెనీ. ఆ తర్వాత దశాబ్దానికి చైనా ఈ ఘనత సాధించింది. వాహక క్షిపణి (కేరియర్ రాకెట్) తొలి దశను చైనా విజయవంతంగా తిరిగి రికవరీ చేసుకోవడమంటే పునర్వినియోగ రాకెట్ సాంకేతికతో ప్రధానమైన విజయాన్ని సాధించినట్లేనని జిన్హువా వార్తా సంస్థ పేర్కొంది.








కామెంట్‌లు (0)