శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు అమరావతి జెఎసితో మంత్రులు చర్చలు

2 గంటల క్రితం

amaravati
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 01:30 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉద్యోగుల ఆర్ధిక బకాయిలు, ఇతర సమస్యలపై రాష్ట్రప్రభుత్వం శనివారం చర్చలు జరపనుంది. ఎపి జెఎసి అమరావతితో ఈ సమావేశం జరగనుంది. బకాయిలు, డిఎలు, పిఆర్‌‌సి వివిధ అంశాలపై ప్రభుత్వం జెఎసి నేతలతో చర్చించనుంది. ఆర్ధిక, రెవెన్యూ శాఖల మంత్రులు పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌ ‌ఎపిజెఎసి అమరావతి యూనియన్‌‌తో శుక్రవారం సచివాలయంలో ప్రాథమిక చర్చలు నిర్వహించారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉందని మంత్రులు జెఎసి నాయకులతో అన్నారు. పూర్తి స్థాయిలో సచివాలయంలో శనివారం చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో జెఎసి చైర్మన్‌ ‌బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ ‌వలిశెట్టి దామోదరావు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్