గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కాలిఫోర్నియాలో కాల్పులు - ఇద్దరు మృతి

24 జూన్, 2026

gun fire
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 24, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- అదుపులో అనుమానితుడు

కాలిఫోర్నియా : అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో ఓ లైబ్రరీలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, ఒక చిన్నారి గాయపడింది. ఈ ఘటన సోమవారం సాయంత్రం చికో నగరంలోని బ్యూట్ కౌంటీ లైబ్రరీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం, కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, భవనం వెనుక వైపు నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన 18 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. గాయపడిన చిన్నారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం లైబ్రరీ పరిసర ప్రాంతాల్లోని రహదారులను తాత్కాలికంగా మూసివేశారు. ప్రస్తుతం ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని, కేసుపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని పోలీస్ చీఫ్ బిల్లీ ఆల్డ్రిడ్జ్ వెల్లడించారు.

అధికారుల కథనం ప్రకారం, అనుమానితుడు మొదట కొంతసేపు లైబ్రరీలో గడిపి, అనంతరం తన వాహనం వద్దకు వెళ్లి తుపాకితో తిరిగి వచ్చాడు. లైబ్రరీ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న వ్యక్తిపై కాలు, తల భాగాల్లో కాల్పులు జరిపిన అనంతరం లోపలికి ప్రవేశించి పలుమార్లు కాల్పులు జరిపినట్లు సిడ్ పటేల్ తెలిపారు. ఘటన స్థలం నుంచి ఒక షాట్‌గన్‌ను, అనుమానితుడి వాహనం నుంచి మరో రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు కేసుకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్