- ఘర్షణలో 25 మంది మృతి
కొలంబో: శ్రీలంకలోని నెగొంబో జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో 25 మంది మరణించినట్లు సమాచారం. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారని రాయిటర్స్ నివేదించింది. కొలంబోకు సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెగొంబోలోని జైలులో ఆదివారం ఈ ఘటన జరిగింది. దాడిని ఆపేందుకు ప్రయత్నించిన నలుగురు జైలు గార్డులు కూడా మరణించారు. రెండు డ్రగ్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య తలెత్తిన వివాదం ఈ పెద్ద ఘర్షణకు దారితీసింది. ఘర్షణ తీవ్రతరం కావడంతో, మహిళల సెల్‌లోని ఖైదీలు పైకప్పుపైకి ఎక్కి తమను విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లు ఎన్‌డిటివి విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దీంతో పైకప్పులోని కొంత భాగం కూలిపోయి పలువురు మహిళలు గాయపడ్డారు. ఈ ఘర్షణకు కారణమేమిటో స్పష్టంగా తెలియరాలేదు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత సోమవారం ఉదయం ఖైదీల బంధువులు జైలు ముందు గుమిగూడారు. మృతులు, గాయపడిన వారి గురించి అధికారులు సమాచారం సేకరిస్తున్నారు.








కామెంట్‌లు (0)