అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రం జూలై 10న విడుదలకు రెడీ అవుతోంది. మురళి కిషోర్ అబ్బూరు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమా స్టార్టింగ్‌లో వచ్చే అత్యంత కీలకమైన ‘శ్రీరామపురం’, ‘భారతం మిట్ట’ అనే సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన పవర్‌ఫుల్ అండ్ బేస్ వాయిస్‌తో ఎన్టీఆర్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించినట్లు మేకర్స్ తెలిపారు. ‘పరిచయం అక్కర్లేని ఆ గంభీరమైన వాయిస్‌తోనే ‘లెనిన్’ ప్రపంచం ప్రేక్షకులకు పరిచయం కాబోతోంద’ని చిత్ర యూనిట్ పేర్కొంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ (సితార ఎంటర్‌టైన్‌మెంట్స్), నాగార్జున (అన్నపూర్ణ స్టూడియోస్) సంయుక్తంగా నిర్మించారు.
ఎన్ టి ఆర్ వాయిస్ ఓవర్‌తో
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 08:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)