సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

హీరోయిన్లను తక్కువగా చూస్తారు : కృతిసనన్

1 గంట క్రితం

kruthi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 08:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సినీ పరిశ్రమలో మహిళా వివక్షపై ఇప్పటికే ప్రముఖ హీరోయిన్లు చాలాసార్లు బహిరంగంగా మాట్లాడారు. తాజాగా కృతిసనన్ కూడా స్పందించారు. ‘ఈ పరిశ్రమలో హీరో చెప్పిందే వింటారు. హీరోయిన్ చెప్పింది అస్సలు పట్టించుకోరు’ అని ఆమె అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రారంభ దశలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ‘ఓ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఓ హీరో కావాలనే నన్ను పక్కన పెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో నా అవసరం లేదనుకుంటే మీరు ఒక్కరే సినిమా ప్రమోట్ చేసుకోండి అని చెప్పి వెనక్కి తగ్గాను` అని కృతిసనన్ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే షూటింగ్ సమయంలో హీరోలకు లగ్జరీ కార్లు, పెద్ద వానిటీ వాన్లు పంపితే.. హీరోయిన్లకు మాత్రం సాధారణ వాహనాలే పంపుతారు. హీరో కంటే ముందే.. హీరోయిన్లు రావాలి. ఒకవేళ హీరోయిన్ పాత్ర గురించి దర్శకుల్ని ప్రశ్నించినా.. లేదా సందేహించినా.. ‘నువ్వెక్కువ ఆలోచిస్తున్నావ్` అని అంటారు. అయితే అదే హీరో తన అభిప్రాయం చెబితే వెంటనే అంగీకరిస్తారు.. దర్శక నిర్మాతలు దాన్ని హీరో కమిట్మెంట్ గా భావిస్తారు. హీరోయిన్ల మాటల్ని మాత్రం పట్టించుకోరు’ అని ఆమె ఇంటర్వ్యూలో మహిళలపై చూపుతున్న వివక్షపై మాట్లాడారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు మౌనంగా ఉండడం కంటే, సమాన గౌరవం కోసం గొంతు విప్పాలని ఆమె అభిప్రాయపడ్డారు. కార్యాలయంలో గానీ, సినిమా సెట్స్‌లో గానీ మహిళలకు సమాన అవకాశాలు, గౌరవం దక్కాలని ఆమె కోరారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్