కోలీవుడ్ సంగీత దర్శకుడు ఆర్‌డి.భాస్కర్ తనయుడు జైయన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఇళయరాజా సోదరుల్లో ఆర్‌డి భాస్కర్ ఒకరు. మ్యూజిక్ కంపోజర్‌గా పేరుగాంచిన ఈయన పలువురు సినీ ప్రముఖులతో కలిసి పనిచేశారు. జైయన్ హీరోగా చేస్తున్న ఈ సినిమాకు 'రాజాస్ ప్లే లిస్ట్' అని టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. రమణన్ బాలగంగాధర్ నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు వెంకట్ ప్రభు కథ అందిస్తున్న ఈ చిత్రంతో సుజిత్ ఎన్.సుబ్రమణియమ్ డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. జైయన్‌కు జంటగా సోనా ఒలికల్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో వాగై చంద్రశేఖర్, గురు సోమసుందరం తదితరులు కనిపించనున్నారు. తాజాగా షూటింగ్ ప్రారంభమైంది. ఇది మంచి మ్యూజికల్ డ్రామా చిత్రంగా ఉంటుందని నిర్మాత పేర్కొన్నారు. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు.
జైయన్ హీరోగా ‘రాజాస్ ప్లేలిస్ట్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 08:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)