శనివారం, 11 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రధాని మోడీ ఎందుకు విలేకరుల సమావేశాలు పెట్టరు..?

3 గంటల క్రితం

pm modi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 12:10 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- నిలదీసిన న్యూజిలాండ్ జర్నలిస్ట్

- నార్వే పర్యటనలో కూడా ఇలాంటి ప్రశ్నే

ఆక్లాండ్. భారతీయ దౌత్యవేత్తలతో జరిగిన సంభాషణలో ప్రధాని మోడీ విలేకరుల సమావేశాలు నిర్వహించకపోవడంపై న్యూజిలాండ్ జర్నలిస్ట్ ఒకరు ప్రశ్న లేవనెత్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం , రెండు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడంపై దృష్టి సారించిన మోడీ మూడు దేశాల పర్యటనలో భాగంగా, చివరి దశలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఊహించని విధంగా "ప్రధాని మోడీ ఎందుకు విలేకరుల సమావేశం నిర్వహించరు ?"అని న్యూజిలాండ్ జర్నలిస్టు నుంచి ఈ ప్రశ్న ఎదురైంది. ఆ ప్రశ్నకు స్పందిస్తూ, విదేశీ వ్యవహారాల శాఖ అధికారి రుద్రేంద్ర టాండన్ మాట్లాడుతూ, ప్రధాని రాజకీయ విధానంపై వ్యాఖ్యానించడం తన పరిధిలోని అంశం కాదని అన్నారు. "ఒక ప్రభుత్వ తరఫున ప్రతినిధి అయిన మోడీ రాజకీయ పద్ధతిని ప్రశ్నించడం నాకు తగదు. అని పేర్కోన్నారు.

మోడీ సంభాషణ శైలిని వివరిస్తూ, మధ్యవర్తుల ద్వారా కాకుండా ఓటర్లతో నేరుగా సంభాషించడానికి ఇష్టపడే నాయకుడిగా టాండన్ ఆయనను అభివర్ణించారు.

నార్వే జర్నలిస్ట్ వివాదం

నార్వే పర్యటనలో కూడా మోడీకి ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మే నెలలో ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చినప్పుడు, జర్నలిస్ట్ హెల్లె లింగ్ అక్కడి నుండి వెళుతున్న మోడీని ఉద్దేశించి, జర్నలిస్టుల ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వరని అడిగారు. ఆ ప్రశ్నకు ప్రధాని స్పందించలేదు. అయితే, ఆ ఘటనపై మీడియాలోని కొన్ని వర్గాలలో , సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఏప్రిల్‌లో భారత్, న్యూజిలాండ్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన కొన్ని నెలల తర్వాత ఈ పర్యటన జరిగింది. 2025 మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ భారత పర్యటన సందర్భంగా మోదీ, లక్సన్‌ల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. ఇరుపక్షాలు ఆర్థిక, వ్యూహాత్మక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాయి. కాగా 2026 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో 180 దేశాలలో భారతదేశం ప్రస్తుతం 157వ స్థానంలో ఉంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్