ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

బెంగాల్‌లో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ బరితెగింపు

3 గంటల క్రితం

rss
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- శ్రమజీవుల పతాకకు నిప్పు పెట్టి పైశాచికం

కొల్‌‌కతా : పశ్చిమ బెంగాల్‌‌లో అధికార బిజెపి గూండాలు సంఘ్‌ ‌పరివార్‌ ‌మూకలతో కలిసి హద్దుమీరి దాడులకు పాల్పడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మూకలు ఇటీవల నిర్వహించిన ఒక ర్యాలీలో శ్రమజీవుల పతాక అయిన ఎర్ర జెండాను తగులపెట్టి పైశాచికాన్ని ప్రదర్శించారు. ఈ దుర్మార్గపు చర్యను భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టు షేర్‌ ‌చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి మూకలు వారి తాతలైన హిట్లర్‌ ‌కాలం నాటి నాజీల అడుగుజాడల్లో నడుస్తున్నారని విమర్శించింది. ఈ దుర్మార్గపు చర్యలకు మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఎం పేర్కొంది. ఎర్రజెండా శ్రమజీవుల మనస్సుల్లో, హృదయాల్లో ఉంటుందని గుర్తు చేసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్