ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వాంగ్‌చుక్‌కు సిపిఎం నేతలు సంఘీభావం

4 గంటల క్రితం

cjp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌, సిబిఎస్ఇ అవ‌క‌త‌వ‌క‌లతో పాటు విద్యా రంగ వైఫ‌ల్యాల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌‌తో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కెకె శైలజ, కెఎన్ బాలగోపాల్, పి రాజీవ్ పరామర్శించి పోరాటానికి మద్దతు తెలిపారు. గత 23 రోజులుగా ఆందోళన చేస్తున్న సిజెపి కార్యకర్తలతోనూ సిపిఎం నాయకులు మాట్లాడారు. జంతర్ మంతర్ వద్ద ఉన్న ఎస్ఎఫ్ఐ క్రాంతి కార్నర్‌ను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం సాజీ, ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి ఐషి ఘోష్, అధ్యక్షులు సూరజ్ ఇలామన్, సంయుక్త కార్యదర్శి మెహినా ఫాతిమా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెకె శైలజ మాట్లాడుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పక్షాన మద్దతు తెలియజేశారు. అలాగే విద్యార్థులు, యువత చేస్తున్న ఈ పోరాటానికి దేశంలోని తల్లులందరి మద్దతు ఉందని ఆమె తెలిపారు. బాలగోపాల్‌ ‌మాట్లాడుతూ ఒకప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా పనిచేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఇప్పుడు బిజెపిలో అమాత్యులుగా ఉంటూ విద్యార్థుల సమస్యలపై నేరపూరితమైన మౌనం పాటించడం దుర్మార్గమని విమర్శించారు. ఇప్పటికైనా ధర్మేంద్ర రాజీనామా చేయాలని డిమాండ్‌ ‌చేశారు. నీట్‌ ‌పరీక్ష సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని గతంలోనే కేరళలోని వామపక్ష ప్రభుత్వం పేర్కొందని, తీవ్రంగా ఆక్షేపించిందని పి రాజీవ్‌ ‌గుర్తు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్