ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

పత్తికి ఎల్ నినో ముప్పు

3 గంటల క్రితం

kharif
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 10:33 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గతేడాదితో పోలిస్తే 25 శాతం వెనుకబాటు

న్యూఢిల్లీ : వాతావరణ పరిస్థితుల ప్రభావంతో అన్నదాతలు ఏ పంట వేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఎల్ నినో ముప్పు పొంచివుందున్న శాస్త్రవేత్తల హెచ్చరికలతో దిక్కుతోచని స్థితిలో సతమతమవుతున్నారు. మరోవైపు రుతుపవనాలు కాస్తంత పుంజుకోవడంతో జులైలో పత్తి విత్తడం వేగవంతమైంది. అయితే ఖరీఫ్ సీజన్‌లో గత ఏడాదితో పోలిస్తే పత్తి సాగు 23 శాతం వెనుకబడి ఉన్నప్పటికీ, వర్షాలు మెరుగుపడటంతో ఆ అంతరం తగ్గుతూ వస్తోంది. దేశంలో పత్తిని ఏడాదికి రెండుసార్లు విత్తుతారు. ప్రాంతాన్ని బట్టి విత్తే సమయం మారుతూ ఉంటుంది. సాధారణంగా పంజాబ్, హర్యానాల్లో విత్తడం మొదలై, ఆ తర్వాత తమిళనాడుకు విస్తరిస్తుంది. సాధారణంగా ఈ ప్రక్రియ జూలై 15 నాటికి ముగుస్తుంది, కానీ రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఈ సీజన్‌లో గడువును జూలై 30 వరకు పొడిగించారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి వర్షాలు కురుస్తుండటంతో, గత వారం వరకు వెనుకబడి ఉన్న గుజరాత్ పత్తి సాగు విస్తీర్ణం ఇప్పుడు గణనీయంగా పెరిగిందని అహ్మదాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి తెలిపారు. వరితో పోలిస్తే పత్తి, పప్పుధాన్యాలకు మంచి ధరలు లభించే అవకాశం ఉన్నందున, కొంత మంది రైతులు వరి సాగు నుంచి పత్తి సాగు వైపు మళ్లుతున్నారని అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలో సోయాబీన్ విత్తిన రైతులు మొలకలు సరిగా రాకపోవటంతో.., వర్షాలు తిరిగి రావడంతో ఇప్పుడు వారు పత్తి సాగు వైపు మొగ్గు చూపుతున్నారని ఆ వ్యాపారి తెలిపారు.

దేశంలో ప్రధాన పత్తి సాగు ప్రాంతాలు

మధ్య భారత్ లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్; ఉత్తర రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్తాన్, దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో పత్తి పంట ఎక్కువగా సాగవుతోంది.

వ్యవసాయ శాఖ తాజా అంచనాల ప్రకారం, 2025-26 సంవత్సరానికి పత్తి ఉత్పత్తి 290.91 లక్షల బేళ్లు (ఒక్కో బేలు 170 కిలోలు)గా ఉంది; ఇది 2024-25లో ఉన్న 297.24 లక్షల బేళ్ల కంటే తక్కువ.

మొత్తం ఖరీఫ్ సాగు

జూన్‌లో వారానికి సుమారు 50 లక్షల హెక్టార్ల మేర సాగు జరగగా, జులైలో అది 200-250 లక్షల హెక్టార్లకు పెరుగుతుంది; ఎందుకంటే సీజన్‌కు సంబంధించిన సాగు విస్తీర్ణంలో ఎక్కువ భాగం ఈ నెలలోనే పూర్తవుతుంది. గత ఏడాది సగటున 1,140 లక్షల హెక్టార్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణంలో, జూన్‌లో సుమారు 250 లక్షల హెక్టార్లలో పంట వేశారు. జూలై నాటికి అది 750 లక్షల హెక్టార్లకు పెరిగింది. విత్తనాలు వేయడం పూర్తయ్యాక మాత్రమే ఉత్పత్తి, ఉత్పాదకత అంచనాలను వేయగలమని అధికారులు పేర్కోంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల మొదట్లో విత్తనాలు వేయడం ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత కురిసిన భారీ వర్షాల వల్ల ఇతర ప్రాంతాల్లో నీరు నిలిచింది. నీరు తగ్గిన తర్వాత ఆ ప్రాంతాల్లోని రైతులు తిరిగి నాట్లు వేయడం ప్రారంభిస్తారని అంచనా వేస్తున్నారు. "వ్యవసాయం అనేది ప్రాంతాన్ని బట్టి ఉంటుంది" అని అధికారులు అంటున్నారు. 2015 ఎల్ నినో తర్వాత ఏ సంవత్సరంలోనూ ఆహార ధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గలేదని, ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆశిస్తున్నారు. అధికారిక విత్తనాల గణాంకాలలో జాప్యంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రభుత్వం మూడు స్థాయిలలో అంచనాలను ధ్రువీకరిస్తుంది. ప్రాథమిక అంచనాలు, రిమోట్ సెన్సింగ్‌తో ప్రాథమిక గణాంకాలను సరిపోల్చడం, బ్లాక్-స్థాయి డిజిటల్ పంట సర్వేల ద్వారా వాస్తవంగా సాగవుతున్న తెల్లబంగారం గురించి వివరాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్