ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యాత్రికుల బస్సు బోల్తా - 16 మందికి గాయాలు

3 గంటల క్రితం

Pilgrims' bus overturns – 16 injured.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 04:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కాంగ్రా : అమర్‌నాథ్‌ యాత్రికులతో వెళుతున్న బస్సు బోల్తా పడడంతో 16 మంది గాయాలపాలయ్యారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌ లోని కాంగ్రా జిల్లాలో జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మొత్తం 57మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్లేందుకు యాత్రికులు ఈ ప్రైవేట్ బస్సును అద్దెకు తీసుకున్నట్లు వెల్లడించారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్