ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

14 జిల్లా కేంద్రాల్లో ర్యాలీ, పికెటింగ్‌‌లు

1 గంట క్రితం

fapto
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 12, 2026, 07:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- జయప్రదం చేయాలని ఫ్యాప్టో పిలుపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :​ పెండింగ్ సమస్యల పరిష్కారానికై ఈ నెల 14వ తేదీన జిల్లా కేంద్రాలలో పిలుపునిచ్చిన ర్యాలీ, పికెటింగ్‌ కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఉపాధ్యాయులకు ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఈ మేరకు ఫ్యాప్టో చైర్మన్‌ ఎల్‌ ‌సాయిశ్రీనివాస్‌, సెక్రటరీ జనరల్‌ ఎస్‌ ‌చిరంజీవి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. 12వపిఆర్‌‌సి అమలు చేయాలని, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను, అన్ని రకాల పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని, సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని,ఇన్ సర్వీస్ టీచర్లకు ప్రత్యేక టెట్ నిర్వహించి టీచర్ బోధించే సబ్జెక్టు ఆధారంగా సిలబస్ ఉండాలని, పరీక్షా విధానం ఆన్లైన్లో ఉండాలని, పాస్ మార్కులు అందరికీ సమానంగా ఉండాలని ఫ్యాప్టోగా డిమాండ్‌ ‌చేస్తున్నామని తెలిపారు. 2025 బదిలీలలో బదిలీ పొంది రిలీవర్‌ ‌లేని కారణంతో పాత స్థానాల్లోనే ఉన్న ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్‌ ‌చేయాలని, ఉపాధ్యాయులకు బోధనేతర కార్యక్రమాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్