శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే...

3 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 11:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఆందోళ‌న‌లు

​ప్ర‌జాశ‌క్తి-న్యూఢిల్లీ బ్యూరో: ​ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఎన్‌టిఎ రద్దును డిమాండ్ చేస్తూ శనివారం ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వందలాది మంది విద్యార్థులు ర్యాలీల్లో పాల్గొన్నారు. 13వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వందకు పైగా ర్యాలీలకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. యుపిలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన బ‌హిరంగ స‌భ‌, ర్యాలీని అఖిల భారత అధ్యక్షుడు ఆదర్శ్ ఎం సాజి ప్రారంభించారు. రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ వహాబ్, అధ్యక్షుడు పార్థ ద్వివేది ఈ ర్యాలీకి నేతృత్వం వహించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగిన ర్యాలీని రాష్ట్ర కార్యదర్శి సన్నీ సెక్తా ప్రారంభించారు. కర్ణాటకలోని హవేరిలో జరిగిన ర్యాలీని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎస్. బసవరాజ్ ప్రారంభించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్